సెల్ఫొన్ సెగ
అమ్మా! ఎట్లావున్నావు? నీ ఆరోగ్యం ఎట్లావున్నది? మేము బాగానే వున్నాము" అంటూ మొదలైన ఆ ఉత్తరం చదివిన మాతృమూర్తి ఆనందాన్ని వర్ణించడం ఎవరితరం?ఉత్తరం వచ్చిన ఇరవై రోజుల తరవాత గానీ, నెల తరవాత గానీ మళ్ళి ఇంకోఉత్తరన్ వచ్చినదాకా పదేపదే ఆపాత ఉత్తరం చదువుకొంటూ ఇరుగు పొరుగు వారికి దగ్గర బంధువులకు చదివి వినిపిస్తూ తన బిడ్డకు తన మీద గల ప్రేమను రక రకాలుగా వర్ణిస్తూ పొందే ఆ అనుభూతి, తృప్తి అనిర్వచనీయం.
హలొ! అమ్మా! బాగున్నావా!మాట్లాడి చాలా రోజులయిందిగదాని చేసాను,రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగావుంది.పంజగుట్ట త్రాఫిక్ లో ఇరుక్కొంటె బండి కదలదు కదా!అందుకే ఫొనె చేసాను. కానీ ఏమీ వినపడటం లేదు,నేను మళ్ళీ చేస్తాలే! ఆరోగ్యం జాగ్రత్త.అని ఫొనె పెట్టేస్తే ఏ తల్లికి తృప్తిగా వుంటుంది? అరుదుగా వినిపించేపిల్లల కంఠం అపురూపంగా వినాలనుకొంటుంది తల్లి. కానీ కార్ల హారన్లు,గళాల గలగలలు తప్ప కొడుకు గొంతు వినిపిస్తేకదా?కానీ ఉత్తరం వ్రాయడానికి గానీ ,ఇంటికి వెళ్ళాక ఫొను చెయ్యడానికిగానీ పిల్లలకు ఖాళీసమయం ఎక్కడుంది? ఈ సెల్ల్ఫోన్లు రాకముందు చాలా విపులంగా పెద్ద ఉత్తరాలు వ్రాసేవారు. ఆఉత్తరాలు దాచుకొని బెంగగా అనిపించినపుడు చదువుకొని ఆనంద పడే వాళ్ళం.
మామూలు ఫొన్లు వచ్చాక కూర్చుని స్థిమితం గా మాట్లాడే వాడు. సెల్ ఫోన్లు వచ్చాక ఉత్తరాలు మానేసారు.సెల్ ఫొన్ల సెగ ఎక్కువయిపోయింది.మంచి వార్తయినా,చెడువార్తయినా అన్ని పప్పులు దాని మీదే ఉడికిస్తున్నారు. వ్యాపార మయినా,వృత్తి సంబంధ మయినా ,ముఖ్య మైన వ్యవహారాలు అయితె సెల్ ఫోన్లు వాడుకో వచ్చు.కానీ అత్మీయులతో,దగ్గర బంధువులతో,బంధాలు,అనుబంధాలు,ప్రేమలు,మమకారాలు పెంచుకోవడానికి,నిలబెట్టుకోవడానికి సెల్ ఫొన్ల కంటే ఉత్తరాలే ఎక్కువ ఉపయోగ పడతాయి. సెల్ ఫోన్ల వాడకం ఎక్కువయితే శరీరానికి హాని కలుగుతుందని వైద్యులు పలురకాలుగా వివరిస్తున్నారు.అందుకె సెల్ ఫొన్ సెగకు దూరంగా వుండండి.ఆరోగ్యం కమిలి పోకుండా చూసుకోండి."ఆరోగ్యమే మహాభాగ్యం.
skip to main |
skip to sidebar
Friday, February 5, 2010
అతిధులు
కొమ్మలు
- నామాట (1)
- సెల్ ఫోన్ సెగ (1)
మిత్రులు
స్వగతం
- జయలక్ష్మి
- హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, India
- తెలుగింటి గృహిణిని...
2 comments:
జయలక్ష్మిగారూ,
ఉన్నమాట చక్కగా చెప్పేరండీ..
మనకి ఏ పిచ్చి పడితే అదే గదా మరి. కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్న సామెతే ఉన్నది. ఇంకా సెల్ ఫోనంటే నలుగురికీ నా దగ్గర ఉన్నది అని గొప్ప పోవటంలొంచి బయటపడలేదు చాలా మంది. కొంతకాలం పడుతుంది ఈ మానసిక వికారంలోంచి ఈ సమాజం బయటపడటాని. కాని విచారింఛదగ్గ విషయం, ఈ వికారానికి మందు మరొక కొత్త వికారం. ప్రస్తుతం టి.వి, సెల్ ఫోను, మరింకా మనలాంటి వాళ్ళం ఇంటర్ నెట్టుతో తీసుకుంటున్నాం. ఒక ఇంట్లో నలుగురూ కూచుని సరదాగా మాట్లాడుకుని ఎన్నాళ్ళయి ఉంటుండి. పొద్దున్నే తలో దారి పరుగు. సాయత్రం తలో టైముకి రావటం, ఒకళ్ళు టి .వి ముందు మరొకళ్ళు కంప్యూటర్ ముందు. ఈ కింది లింకునుండి సెల్ వెర్రి గురించిన వ్యాసం చదవండి
http://saahitya-abhimaani.blogspot.com/2009/12/blog-post_15.html
Post a Comment