సెల్ఫొన్ సెగ
అమ్మా! ఎట్లావున్నావు? నీ ఆరోగ్యం ఎట్లావున్నది? మేము బాగానే వున్నాము" అంటూ మొదలైన ఆ ఉత్తరం చదివిన మాతృమూర్తి ఆనందాన్ని వర్ణించడం ఎవరితరం?ఉత్తరం వచ్చిన ఇరవై రోజుల తరవాత గానీ, నెల తరవాత గానీ మళ్ళి ఇంకోఉత్తరన్ వచ్చినదాకా పదేపదే ఆపాత ఉత్తరం చదువుకొంటూ ఇరుగు పొరుగు వారికి దగ్గర బంధువులకు చదివి వినిపిస్తూ తన బిడ్డకు తన మీద గల ప్రేమను రక రకాలుగా వర్ణిస్తూ పొందే ఆ అనుభూతి, తృప్తి అనిర్వచనీయం.
హలొ! అమ్మా! బాగున్నావా!మాట్లాడి చాలా రోజులయిందిగదాని చేసాను,రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగావుంది.పంజగుట్ట త్రాఫిక్ లో ఇరుక్కొంటె బండి కదలదు కదా!అందుకే ఫొనె చేసాను. కానీ ఏమీ వినపడటం లేదు,నేను మళ్ళీ చేస్తాలే! ఆరోగ్యం జాగ్రత్త.అని ఫొనె పెట్టేస్తే ఏ తల్లికి తృప్తిగా వుంటుంది? అరుదుగా వినిపించేపిల్లల కంఠం అపురూపంగా వినాలనుకొంటుంది తల్లి. కానీ కార్ల హారన్లు,గళాల గలగలలు తప్ప కొడుకు గొంతు వినిపిస్తేకదా?కానీ ఉత్తరం వ్రాయడానికి గానీ ,ఇంటికి వెళ్ళాక ఫొను చెయ్యడానికిగానీ పిల్లలకు ఖాళీసమయం ఎక్కడుంది? ఈ సెల్ల్ఫోన్లు రాకముందు చాలా విపులంగా పెద్ద ఉత్తరాలు వ్రాసేవారు. ఆఉత్తరాలు దాచుకొని బెంగగా అనిపించినపుడు చదువుకొని ఆనంద పడే వాళ్ళం.
మామూలు ఫొన్లు వచ్చాక కూర్చుని స్థిమితం గా మాట్లాడే వాడు. సెల్ ఫోన్లు వచ్చాక ఉత్తరాలు మానేసారు.సెల్ ఫొన్ల సెగ ఎక్కువయిపోయింది.మంచి వార్తయినా,చెడువార్తయినా అన్ని పప్పులు దాని మీదే ఉడికిస్తున్నారు. వ్యాపార మయినా,వృత్తి సంబంధ మయినా ,ముఖ్య మైన వ్యవహారాలు అయితె సెల్ ఫోన్లు వాడుకో వచ్చు.కానీ అత్మీయులతో,దగ్గర బంధువులతో,బంధాలు,అనుబంధాలు,ప్రేమలు,మమకారాలు పెంచుకోవడానికి,నిలబెట్టుకోవడానికి సెల్ ఫొన్ల కంటే ఉత్తరాలే ఎక్కువ ఉపయోగ పడతాయి. సెల్ ఫోన్ల వాడకం ఎక్కువయితే శరీరానికి హాని కలుగుతుందని వైద్యులు పలురకాలుగా వివరిస్తున్నారు.అందుకె సెల్ ఫొన్ సెగకు దూరంగా వుండండి.ఆరోగ్యం కమిలి పోకుండా చూసుకోండి."ఆరోగ్యమే మహాభాగ్యం.
skip to main |
skip to sidebar
జిగీష
Friday, February 5, 2010
Sunday, January 31, 2010
నామాట
నామాట
నా పేరు జయలక్ష్మి. నాకు లలిత కళల పట్ల ఆసక్తి వుంది.సంగీతం వినడం,సాహిత్యంచదవడం నాకిష్టం. సున్నిత మైన హాస్యం ఇష్ట పడతాను. జ్ఞాన నేను స్నేహితులం. తన ద్వరా బ్లొగుల పరిచయం కలిగింది. అందరి బ్లొగులు చూసాక నేను ఒక బ్లొగ్ మొదలుపెడితే బాగుంటుంది అని పించింది. ఆకొరిక ఫలితమే నా "జిగీష " బ్లొగ్. బ్లొగర్లందరూ సహృదయంతో నాకు సహకరించి నన్ను ముందుకు నడిపించాలని కొరుకొంటున్నాను.జిగీష అంటే ఉత్సుకత .
వై.జయలక్ష్మి
నా పేరు జయలక్ష్మి. నాకు లలిత కళల పట్ల ఆసక్తి వుంది.సంగీతం వినడం,సాహిత్యంచదవడం నాకిష్టం. సున్నిత మైన హాస్యం ఇష్ట పడతాను. జ్ఞాన నేను స్నేహితులం. తన ద్వరా బ్లొగుల పరిచయం కలిగింది. అందరి బ్లొగులు చూసాక నేను ఒక బ్లొగ్ మొదలుపెడితే బాగుంటుంది అని పించింది. ఆకొరిక ఫలితమే నా "జిగీష " బ్లొగ్. బ్లొగర్లందరూ సహృదయంతో నాకు సహకరించి నన్ను ముందుకు నడిపించాలని కొరుకొంటున్నాను.జిగీష అంటే ఉత్సుకత .
వై.జయలక్ష్మి
అతిధులు
కొమ్మలు
- నామాట (1)
- సెల్ ఫోన్ సెగ (1)
మిత్రులు
స్వగతం
- జయలక్ష్మి
- హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, India
- తెలుగింటి గృహిణిని...